ఏప్రిల్ 9 నుండి 18 వరకు నారాయణవనం శ్రీఅగస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 9 నుండి 18 వరకు నారాయణవనం శ్రీఅగస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, ఏప్రిల్ 07, 2011: తిరుపతి పుణ్యక్షేత్రానికి సుమారు 25 కి.మీ. దూరంలో వెలసియున్న నారాయణవనంలోని అగస్తీశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 9 నుండి 18వ తారీఖు వరకు జరుగనున్నాయి.
చిత్తూరు జిల్లాలో వెలసియున్న ప్రముఖ శైవదేవాలయాలలో అగస్తీశ్వరాలయం ఒకటి.
ఈ ఆలయాన్ని పూర్వం అత్యంత తపోశాలి అయిన మహర్షి అగస్తీశ్వరుడు శివుని వరం పొంది ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాడు గనుక ఆయన పేరుమీదుగా ఈ ఆలయం ఇక్కడ వెలసినది. పద్మావతీదేవితో పరిణయం అయిన అనంతరం శ్రీ శ్రీనివాసుడు ఈ అగస్తీశ్వర ఆలయంలో ఆ మహర్షి ఆశీస్సులు పొందడానికి ఇక్కడికి విచ్చేసి 6 నెలల పాటు ఇక్కడే వున్నాడన్నది చారిత్రక ప్రాశస్థ్యం.
కాగా 10 రోజుల పాటు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 8వ తారీఖున అంకురార్పణ జరుగనుంది. ఏప్రిల్ 9న ఉదయం 8.00 నుండి 8.45 నిమిషాల నడుమ మిధునలగ్నంలో ధ్వజారోహణం నేత్రపర్వంగా వేదపండితులు నిర్వహించనున్నారు. కాగా 10వ తారీఖు మొదలుకొని ఏప్రిల్ 17వ తారీఖు వరకు ప్రతి రోజు ఉదయం 10.00 గంటల నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. అయితే ఈ వాహన సేవల్లో అత్యంత ప్రధానమైన వృషభ వాహనం మాత్రం సాయంత్రం 6.30 నుండి రాత్రి 11.00 గంటల వరకు జరుగుతుంది.
బ్రహ్మోత్సవాలలో భాగంగా రోజువారి వాహనసేవలు ఈ విధంగా వున్నాయి.
తేది ఉదయం సాయంత్రం
09-04-2011 ధ్వజారోహణం(ఉ.8 నుండి 8-45 మధ్య) చంద్రప్రభ వాహనం
10-04-2011 స్నపనతిరుమంజనం సింహ వాహనం
11-04-2011 స్నపనతిరుమంజనం హంస వాహనం
12-04-2011 స్నపనతిరుమంజనం శేష వాహనం
13-04-2011 స్నపనతిరుమంజనం వృషభ వాహనం
14-04-2011 స్నపనతిరుమంజనం గజ వాహనం
15-04-2011 స్నపనతిరుమంజనం రథోత్సవం వాహనం
16-04-2011 స్నపనతిరుమంజనం అశ్వ వాహనం
17-04-2011 స్నపనతిరుమంజనం రావనేశ్వర వాహనం
18-04-2011 త్రిశూల స్నానం (కైలాసకోన) ధ్వజావరోహణం (రాత్రి 6.30నుండి 7.30 గంటల మధ్య)
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.