ఏఫ్రిల్‌ 24వ తేదిన ‘తెలుగు ప్రశస్తి’ 

ఏఫ్రిల్‌ 24వ తేదిన ‘తెలుగు ప్రశస్తి’

తిరుపతి, ఏఫ్రిల్‌-21, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్వేత ఆధ్వర్యంలో తెలుగు అధికార భాషా సంఘం రూపొందించిన ‘తెలుగు ప్రశస్తి’ అను సంగీత నృత్యరూపకాన్ని ఏఫ్రిల్‌ 24వ తేదిన స్థానిక మహతి ఆడిటోరియం నందు సాయంత్రం 6 గంటలకు ప్రదర్శిస్తారు.

తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిన సందర్భంలో తితిదే పరిపాలనలో తెలుగును అమలు చేస్తున్న ఒక విశిష్ట సంస్థగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడమైనది. ధార్మిక  కార్యక్రమాల ప్రచారంలో స్వంత భాషలో వ్యవహారాలు నడపడం అత్యంత అవసరం. తితిదే ఆయా భాషలు తెలిసినవారికి ఆయాభాషలలోనే ధార్మిక కార్యక్రమాలు కొనసాగించడం ఒక సంప్రదాయంగా పెట్టుకున్నది. తిరుమలకు వచ్చే యాత్రికులతో కూడా తితిదే ఉద్యోగులు ఆయాభాషల్లోనే వ్యవహార సరళిని నడపడం ఒక విశిష్టతనం సంతరించుకున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు ప్రశస్తి అను నృత్యరూపకాన్ని తితిదే మహతిలో ఏర్పాటు చేస్తున్నది.

కనుక పురప్రజలు, తెలుగు భాషాభిమానులు ఈ నృత్యరూపకాన్ని తిలకించి తరించాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.