PILGRIM SERVICES IN A TRANSPARENT WAY THROUGH IT INITIATIVES-TTD IT WING CHIEF _ ఐటీతో టీటీడీలో వేగంగా, పారదర్శకంగా సేవలు – ఐటి జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ రెడ్డి

Tirumala, 16 October 2023: The IT initiatives taken up by TTD since 2021 has resulted in providing transparent services to pilgrims said TTD IT General Manager Sri LM Sandeep Reddy. 

 

Addressing during the media conference held at Rambhagicha 2 Rest House in Tirumala as part of Navaratri Brahmotsavams festivities on Monday noon, the IT Chief of TTD said a vehicle pass management system application has been designed recently for regulating vehicle movements and parking lots in Tirupati and Tirumala during the mega festival.

 

He said the vahana sevas were updated on social media and live streaming has been effectively facilitated for the benefit of the global devotees. With the slogan, One institution, one website, one mobile, TTD has changed its website name as https://ttdevasthanams.ap.gov.in and at present all the services have been faster with over 96% accuracy rate with adaptation to cloud platform. 

 

He said the exclusive apps for Darshan, laddus, accommodation, lockers, Srivari Seva, online lucky dip, student management app in TTD educational institutions, hospital management app etc.have been yielding fruitful results. He said even the recent allotment of house sites to TTD employees has been successfully carried out through a separate app in a transparent manner. 

 

The IT GM said online booking for arjita sevas in 60 local and taken over temples of TTD temples will soon be introduced akin to Tirumala.

 

PRO Dr T Ravi,  APRO Kum P Neelima, IT Managers Sri Nadamuni and Sri Nagaraja Reddy were also present. 

 
 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఐటీతో టీటీడీలో వేగంగా, పారదర్శకంగా సేవలు – ఐటి జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ రెడ్డి

తిరుమల, 2023 అక్టోబ‌రు 16: టీటీడీ ఐటీ విభాగం ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందించడం ద్వారా శ్రీవారి భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలు, గదులు, లడ్డూ ప్రసాదం తదితర సేవలను వేగంగా, పారదర్శకంగా అందిస్తోందని ఐటి జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ రెడ్డి తెలిపారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ సందీప్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా వెహికల్ పాస్ మేనేజ్మెంట్ సిస్టం అప్లికేషన్ రూపొందించి తిరుపతి శివారు ప్రాంతాల్లో వాహనాలకు పాసులు మంజూరు చేశామని, దీని ద్వారా తిరుమలలో వాహనాల రద్దీ పెరిగినప్పుడు విజిలెన్స్ అధికారులు తిరుపతిలోనే పార్కింగ్ వసతి కల్పించారని తెలిపారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలను సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాహన సేవలను వీక్షించి తరిస్తున్నారని తెలియజేశారు. ఒకే సంస్థ, ఒకే వెబ్సైట్, ఒకే మొబైల్ యాప్ అన్న నినాదం మేరకు వెబ్సైట్ పేరును https://ttdevasthanams.ap.gov.in గా మార్చామని వెల్లడించారు. తద్వారా టీటీడీకి సొంతంగా ట్రేడ్ మార్క్ ఉంటుందని, నకిలీ వెబ్సైట్లను నియంత్రించే అవకాశం లభిస్తుందని అన్నారు. 2021వ సంవత్సరం నుంచి టీటీడీ వెబ్సైట్, యాప్ క్లౌడ్ కు మారాయని, అప్పటినుంచి వేగవంతంగా దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్ జరుగుతోందని వివరించారు.

వీటితోపాటు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, తిరుమలలో పారదర్శకంగా గదులు కేటాయించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్జితసేవల ఆన్లైన్ లక్కీ డిప్ తో పాటు తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయంలో ఆఫ్ లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ అమలు చేస్తున్నామని చెప్పారు. టీటీడీ విద్యాసంస్థల్లో స్టూడెంట్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో హాస్పిటల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ద్వారా మెరుగైన పాలన జరుగుతోందన్నారు. త్వరలో టీటీడీ పరిధిలోని 60 స్థానిక ఆలయాల్లో భక్తులు ఆర్జిత సేవలను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. శ్రీవారి సేవ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా సేవకులు నమోదు చేసుకుంటున్నారని చెప్పారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి డిప్ ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో పీఆర్వో డా.టి.రవి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ, ఐటి మేనేజర్లు శ్రీ నాదముని, శ్రీ నాగరాజరెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.