TTD EO INSPECTS AND REVIEWS THE ANNUAL BRAHMOTSAVAM ARRANGEMENTS OF VONTIMITTA SRI KODANDARAMA SWAMY TEMPLE _ ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో

Vontimitta, 01 March 2025: As the annual Brahmotsavam at Vontimitta Sri Kodandarama temple in Kadapa district along with the statr festival of Sri Sita Rama Kalyanam is scheduled from April 06 to15 TTD EO Sri J. Syamala Rao said that elaborate arrangements will be made for the annual Brahmotsavam.

The TTD EO along with Kadapa District Collector and SP, JEO, TTD officials inspected the temple,  surroundings and Kalyana Vedika areas on Saturday and later conducted a review meeting.

Speaking on the occasion, he asked the officials to complete the development works in the temple by the end of March and make the Kalyana Vedika venue attractive.  

He asked the TTD officials to coordinate with the Kadapa district authorities and make advance arrangements in a planned manner so that the devotees do not face any difficulties.   

He said that he will review the progress of the work every 15 days.  He instructed the officials concerned to give wide publicity in Kadapa and Annamaiah district main towns and surrounding areas through Prachara Rathams.  

Later the EO directed the officials of engineering and other departments to complete the works to be done in the context of Brahmotsavam according to the check list and make convenient arrangements for the devotees.  

Extensive arrangements should be made on April 11 for the celestial Kalyanam.  

In view of the fact that there will be more than one lakh devotees who are likely to come for this Kalyan, TTD officials and district officials have been advised to work in coordination and conduct  Department wise reviews frequently.

In view of the rush of devotees, special attention should be paid towards maintaining traffic, distribution of Annaprasadam, drinking water and buttermilk, keeping in view the scorching temperatures of summer.

Kadapa District Collector Dr.  Cherukuri Sridhar, SP Sri EG Ashok Kumar, TTD JEO Sri Veerabrahmam, DRO Sri Visveswara Naidu, TTD CE Sri Satyanarayana, SE (Electrical) Sri Venkateswarlu, Deputy EO Sri PV Natesh Babu, VGO Smt. Sadalakshmi and other departmental officers participated.

Vahanams during Brahmotsavams

 06.04.2025 (Sri Rama Navami) –  Vrishab Lagna.  Dhwajarohanam between 9.30am – 10.15am 

Shesha Vahan at 7pm

 

07-04-2025 Venugana Alankaram – Hamsa Vahanam

08-04-2025 Vatapatrasai Alankaram – Simha Vahanam 

09-04-2025 Navaneethakrishna Alankaram Hanumantha Vahanam

10-04-2025 Mohini Alankaram Garudaseva

11-04-2025 Sivadhanurbhana Alankaram Sri Sitaramula Kalyanam (at 8.30pm), Gajavahanam.

 12-04-2025 Rathotsavam

 13-04-2025 Kaliyamardhana Alankaram Asva Vahanam

 14-04-2025 Chakrasnanam Dhwajavarohanam (7pm)

 15-04-2025 —Pushpayagam(6pm)

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో

మార్చి చివరి నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం

టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులతో సమీక్ష

ఒంటిమిట్ట / తిరుపతి, 2025, మార్చి 01: కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 06 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు వెల్లడించారు. టిటిడి అధికారులు, కడప జిల్లా కలెక్టర్ , ఎస్పీలతో కలసి ఆలయ పరిసరాలు, కల్యాణ వేదిక ప్రాంతాలను శనివారం పరిశీలించి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మార్చి చివరి నాటికి ఆలయంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, కల్యాణ వేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు. కడప జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా చేపట్టాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షిస్తానని చెప్పారు. బ్రహ్మోత్సవాలపై ప్రచార రథాల ద్వారా కడప, అన్నమయ్య జిల్లా ప్రధాన పట్టణాలతోపాటు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చేయాల్సిన పనులను చెక్ లిస్ట్ ప్రకారం పూర్తి చేయాలని , భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజనీరింగ్, తదితర శాఖ అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్‌ 11న శ్రీ సీతారాముల కల్యాణం : ఈవో

ఏప్రిల్‌ 11న శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించే ఈ కల్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం పరిసరాలు, కల్యాణ వేదిక సమీపంలో ట్రాఫిక్ , భధ్రతా, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిక, స్వామివారి తలంబ్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో కడప జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్, ఎస్పీ శ్రీ ఈ జీ అశోక్ కుమార్,డిఆర్వో శ్రీ విశ్వేశ్వర నాయుడు, టిటిడి సిఈ శ్రీ సత్యనారాయణ, ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీ పి.వి.నటేష్ బాబు, విజిఓ శ్రీమతి సదాలక్ష్మి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు

06.04.2025 (శ్రీరామ నవమి) – వృషభ లగ్నంలో ఉ. 9.30 – 10.15 గం.ల మధ్య ధ్వజారోహణం, సా.7 గం.లకు శేష వాహనం
07-04-2025 వేణుగాన అలంకారం హంస వాహనం
08-04-2025 వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
09-04-2025 నవనీతకృష్ణ అలంకారం హనుమంత వాహనం
10-04-2025 మోహినీ అలంకారం గరుడసేవ
11-04-2025 శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8.30 గం||లకు), గజవాహనం.
12.-04-2025 రథోత్సవం
13-04-2025 కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
14-04-2025 చక్రస్నానం ధ్వజావరోహణం(రా|| 7 గం||)
15-04-2025 ——– పుష్పయాగం(సా|| 6 గం||).

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది