COMPLETE ALL WORKS AHEAD OF ANNUAL BRAHMOTSAVAMS AT VONTIMITTA- JEO _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి తిరుపతి జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌

Vontimitta, Kadapa Dist, 5 Feb. 20: All the pending works which are going on Sri Kodandaramalayam at Vontimitta in YSR Kadapa District should be completed well in advance before the annual brahmotavams which commences on April 2, said TTD Joint Executive Officer, Sri P Basant Kumar.

The JEO inspected the ongoing works at Vontimitta on Wednesday and directed the officials concerned to complete all ongoing development works at the temple ahead of annual Brahmotsavams. He inspected the works undertaken in temple surroundings and kalyana vedika. He later instructed officials to complete works on Queue lines, Office and Rest House buildings on a war footing basis and a rest house complex near Kalyana Vedika. He advised officials to keep past experiences in mind and complete all arrangements like parking and creation of devotional ambiance with green landscape for devotees benefit ahead of the holy festival of Sri Sitarama Kalyanam.

Later speaking to media, he said TTD has launched the prestigious development works worth ₹56 crore which are scheduled to be completed by March 15.

He said construction of waiting rooms at a cost of ₹1.6 crores were at various stages of progress and another ₹46 lakhs worth works including Arch near kalyana Vedika, toilets and flooring works were taken up in co-ordination with the ASI. 

The JEO also inspected the ongoing works in Sri Lakshmi Venkateswara temple at Devuni Kadapa and also at the 108 feet Sri Annamacharya statue at Rajampeta.

CE Sri Ramachandra Reddy, DyEO Sri Chakravarti Govindarajan, SE I Sri Ramesh Reddy, SE (Electrical) Sri Venkateswarlu, Anna Prasadam Special Grade DyEO Smt Parvati, EE Sri Jaganmohan Reddy, Deputy EE Sri Harshavardhan Reddy, Catering Officer Sri Saibaba Reddy and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి తిరుపతి జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌  

ఒంటిమిట్ట, 2020 ఫిబ్రవరి 05: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయాల‌ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని బుధ‌వారం జెఈవో సందర్శించారు. ఆలయ పరిసరాలు, కల్యాణవేదిక ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామాలయాన్ని రూ.56 కోట్ల‌తో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా క‌ల్యాణ వేదిక వ‌ద్ద జ‌రుగుతున్న ఆర్చి నిర్మాణం, మరుగుదొడ్లు తదితర అభివృద్ధి ప‌నులు మార్చి 15వ తేదీకి పూర్త‌వుతాయ‌న్నారు. ఇప్ప‌టికే రూ.1.6 కోట్ల‌తో నిర్మించిన భ‌క్తులు వేచి ఉండే గ‌దులు త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా భారత పురావస్తు శాఖ ఆధ్వ‌ర్యంలో రూ.46 ల‌క్ష‌ల‌తో పోటు మరమ్మతులు, ఫ్లోరింగ్‌ పనులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌న్నారు.

ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, కార్యాలయ భవనం, విశ్రాంతిగృహం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్టకు విచ్చేసే భక్తుల వసతి కొరకు కల్యాణ వేదిక వద్ద నిర్మించిన వసతి సముదాయం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శ్రీ సీతా రాముల క‌ల్యాణానికి విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు ముంద‌స్తుగా పూర్తి చేస్తున్నామ‌న్నారు. అదేవిధంగా పార్కింగ్‌ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు మొక్కలను విరివిగా నాటాలని అధికారుల‌కు సూచించారు.

అంత‌కుముందు దేవుని క‌డ‌ప‌లోని శ్రీ ల‌క్ష్మి వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం రాజంపేటలోని 108 అడుగుల శ్రీ అన్న‌మ‌య్య విగ్ర‌హ‌న్ని ప‌రిశీలించారు.  

ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ చ‌క్ర‌వ‌ర్తి గోవింద‌రాజ‌న్‌, ఎస్‌ఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్‌) శ్రీ వేంకటేశ్వర్లు, అన్నప్రసాదం ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి పార్వ‌తి, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, డెప్యూటీ ఇఇ శ్రీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, క్యాట‌రింగ్ అధికారి శ్రీ సాయిబాబారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.