VONTIMITTA SRI KODANDARAMA SWAMY TEMPLE MAHA SAMPROKSHANAM HELD _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
Vontimitta, 09 March 2025: The sacred Maha Samprokshanam was conducted in Vontimitta Sri Kodandaramaswamy temple on Sunday wherein TTD Chairman Sri. BR Naidu participated along with TTD JEO Sri Veerabrahmam.
As part of this during the first half of the day, Murthi Homam, Sri Madramayana Homam, Panchasukta – Pavamana Homam were conducted.
After that at 9:30 am Maha Purnahuti, 10.15 am to 11:30 am Maha Samprokshanam and Maha Kumbhabhishekam in Vrishabha Lagnam, Swarna Pusparchana were performed as per Agamas. Later the devotees were allowed for darshan.
In this program the temple priests, Deputy EOs Sri. Natesh Babu, Sri. Govinda Rajan, Sri. Selvam, Smt. Prashanthi, SEs Sri. Venkateswarlu, Sri. Manoharam, VGO Smt. Sadalakshmi, Press and Sales Wing Special Officer Sri. Ramaraju and other officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
– భక్తులకు శ్రీ కోదండరామస్వామివారి మూలమూర్తి దర్శనం
ఒంటిమిట్ట / తిరుపతి, 2025 మార్చి 09: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు దంపతులు, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఉదయం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీ మద్రామాయణ హోమం, పంచసూక్త – పవమాన హోమములు నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10.15 నుండి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ మరియు మహా కుంభాభిషేకము, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సీపీఆర్వో డా. టి.రవి,
డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీ గోవింద రాజన్, శ్రీ సెల్వం, శ్రీమతి ప్రశాంతి, ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహర్, వీజీవో శ్రీమతి సదాలక్ష్మి, ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి శ్రీ రామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.