KOIL ALWAR TIRUMANJANAM HELD AT VONTIMITTA _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 01 April 2025: The traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam, was observed at Sri Kodandarama Swamy temple at Vontimitta in Kadapa district,
on Tuesday in view of the annual Brahmotsavams from April 05-15.
Koil Alwar Tirumanjanam is an Agamic temple cleansing ritual which is usually observed before any mega religious event.
‘Koil’ means the temple, ‘Alwar’ means the devotee and ‘Tirumanjanam’ means divine cleansing activity. On totto, Koil Alwar Tirumanjanam is a Agama ritual which means cleaning of the temple premises by the devotees.
On Tuesday, an aromatic mixture called “Parimalam” was smeared all along walls, roofs of the main temple, sub- temples, puja utensils.
This unique mixture is an amalgamation of Srichurnam, Namakopu, Vermilion, Turmeric, A tuber vegetable called Kichchili Gadda, which provides a cooling and soothing effect
Temple officials performed this event with utmost devotion from 8am till 11:30am. Later devotees are allowed for darshan.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట / తిరుపతి, 2025 ఏప్రిల్ 01: ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
06-04-2025
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు వృషభ లగ్నం)
రాత్రి – శేష వాహనం
07-04-2025
ఉదయం – వేణుగానాలంకారము
రాత్రి – హంస వాహనం
08-04-2025
ఉదయం – వటపత్రశాయి అలంకారము
రాత్రి – సింహ వాహనం
09-04-2025
ఉదయం – నవనీత కృష్ణాలంకారము
రాత్రి – హనుమంత వాహనం
10-04-2025
ఉదయం – మోహినీ అలంకారము
రాత్రి – గరుడసేవ
11-04-2025
ఉదయం – శివధనుర్భాణ అలంకరణ
రాత్రి – కళ్యాణోత్సవము/ గజవాహనము
12-04-2025
ఉదయం – రథోత్సవం
13-04-2025
ఉదయం – కాళీయమర్ధనాలంకారము
రాత్రి – అశ్వవాహనం
14-04-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం.
ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.