KOIL ALWAR TIRUMANJANAM PERFORMED GRANDLY AT SRI KODANDARAMA SWAMY TEMPLE, VONTIMITTA _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Vontimitta / Tirupati, March 24, 2026: The Koil Alwar Tirumanjanam ritual was performed with great grandeur on Tuesday morning at the Sri Kodandarama Swamy Temple in Vontimitta.
As the annual Brahmotsavams of the temple are scheduled to be held from March 27 to April 5, this traditional purification ceremony was conducted as a customary prelude to the festivities.
On this occasion, the Lord was awakened with Suprabhatam in the morning, followed by Archana. Thereafter, Koil Alwar Tirumanjanam was performed from 8:00 AM to 11:30 AM.
As part of the ritual, the sanctum sanctorum, the shrines of Sri Anjaneya Swamy and Garutmanta, the temple premises, walls, ceilings, and puja materials were thoroughly cleansed with water. Subsequently, a sacred mixture prepared with aromatic ingredients such as Namakoppu, Srichurnam, kasturi turmeric, betel leaves, edible camphor, sandalwood powder, kumkum, and other fragrant substances was sprinkled throughout the temple परिसर.
Devotees were allowed for Sarva Darshan from 11:30 AM onwards.
Deputy EO Smt. Prasanthi, Temple Inspector Sri Naveen, temple priests, and other officials participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట / తిరుపతి, 2026 మార్చి 24: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.
ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటల నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతుని సన్నిధులు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
అనంతరం ఉదయం 11.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.




