EO REVIEWS VONTIMITTA BRAHMOTSAVAM ARRANGEMENTS _ ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి – ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirupati, 20 March 2024: TTD EO Sri AV Dharma Reddy urged the officials to speed up all arrangements for the successful conduct of the annual  Brahmotsavam at Vontimitta Sri Kodanda Ramalayam from April 17-25 with Ankurarpanam on April 16 and the iconic state festival of Sri Seeta Rama Kalyanotsavam on April 22.

Addressing a review meeting at the conference hall of the TTD administrative building in Tirupati on Wednesday with all the departments along with JEO Sri Veerabrahmam and CVSO Sri Narasimha Kishore, he directed the officials concerned to make coordinated efforts and ensure all to provide Anna Prasadam, drinking water and buttermilk to thousands of devotees attending the prestigious events.

Among others cool painting on walk path of devotees and cool shelters, fitness certificates for operating Ratham and Vahanams, deployment of 300 Srivari Sevaks to prepare Thalambralu packets and 2000 Sevaks for the day of Kalyanam etc.

He also reviewed on the medical facilities including keeping ambulances, primary health centres, stocking of ORSmpackets, action plan for cultural activities, public transport, parking and accommodation. He asked TTD officials to coordinate with the YSR Kadapa district officials for the smooth conduct of the divine events.

Among others SVBC CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SEs Sri Jagadeeshwar Reddy, Sri Satyanarayana, Sri Venkateswarlu, Estate officer Sri Gunasbhushana  Reddy, DyEOs Sri Natesh Babu, Smt Prashanti and officials of various departments were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి – ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుపతి, 2024 మార్చి 20: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో ఏప్రిల్ 16న అంకురార్పణ, ఏప్రిల్ 17న శ్రీరామనవమి పర్వదిన ధ్వజారోహణముతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై బుధ‌వారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ 22న జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారులను ఆదేశించారు.

క‌ల్యాణం రోజున వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అన్న‌ప్ర‌సాదం, తాగునీరు, మ‌జ్జిగ అందించేందుకు చ‌క్క‌టి ఏర్పాట్లు చేయాల‌న్నారు. అన్ని విభాగాలు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని క‌ల్యాణం రోజున భ‌క్తుల‌కు అందాల్సిన సౌక‌ర్యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని కోరారు. ఎండ వేడిమి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు భ‌క్తులు న‌డిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాల‌ని, అవ‌స‌ర‌మైన చోట్ల చ‌లువపందిళ్లు ఏర్పాటు చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. ఊరేగింపు నిర్వ‌హించే వాహ‌నాలు, ర‌థానికి సంబంధించిన ప‌టిష్ట‌త‌ను ప‌రిశీలించి ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ తీసుకోవాల‌న్నారు. సీతారాముల త‌లంబ్రాల ప్యాకింగ్‌కు 300 మంది, క‌ల్యాణం రోజున భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, త‌లంబ్రాల పంపిణీకి దాదాపు 2 వేల మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను సిద్ధం చేసుకోవాల‌న్నారు.

అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిస్థితుల్లో వెంట‌నే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాల‌ని, ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేసి త‌గిన‌న్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాల‌ని వైద్య అధికారులకు సూచించారు. సాంస్కృతిక‌, సంగీత కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక త్వ‌రిత‌గ‌తిన సిద్ధం చేయాల‌న్నారు. క‌ల్యాణం రోజున భ‌క్తుల‌ ర‌వాణా, వ‌స‌తి, పార్కింగ్‌ క‌ల్పించేందుకు ఆర్‌టిసి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి స‌న్న‌ద్ధంగా ఉండి వైఎస్ఆర్ జిల్లాలోని ఆయా విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.

ఈ సమావేశంలో జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబిసి సిఈవో శ్రీ ష‌ణ్ముఖ కుమార్‌, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇలు శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణభూషణ రెడ్డి , డెప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.