AKKAGARLA GUDI PUJA HELD _ కనుమ రహదారిలో వైభవంగా అక్కగార్లకు కార్తీకమాస పూజలు

TIRUMALA, 13 DECEMBER 2024: The annual Puja ceremony at Akkagarla Gudi located on the First Ghat Road(Down Ghat) was observed on Friday under the aegis of TTD Transport wing.

As a part of the Puja, Sare was offered to these Sapta Matrukas on the occasion.

DLO Sri Varaprasad Rao, DyEOs Smt Asha Jyothi, Sri Rajendra and others, devotees were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కనుమ రహదారిలో వైభవంగా అక్కగార్లకు కార్తీకమాస పూజలు

తిరుమల, 2024 డిసెంబరు 13: తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కగార్ల గుడిలో ఏడుగురు అక్కగార్లకు శుక్రవారం ఉదయం టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజ ఘనంగా నిర్వహించారు.

అక్కదేవతలకు ప్రతి సంవత్సరం కార్తీకమాసపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో అక్కగార్లకు సారె సమర్పించారు. కనుమ రోడ్డులో భక్తులు సురక్షితంగా ప్రయాణాలు సాగించేలా అనుగ్రహించాలని అక్కగార్లను ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ లా ఆఫీసర్ శ్రీ ఏ.వరప్రసాదరావు, డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీమతి ఆశాజ్యోతి, రవాణా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.