PUSHPA YAGAM AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ క‌న్నుల ‌పండుగ‌గా పుష్పయాగం

Tirupati, 02 July 2025: The annual Pushpayagam was held with religious fervour at Sri Govindaraja Swamy Temple in Tirupati on Wednesday evening.

Earlier from 9.30 AM to 11.30 AM, Snapana Tirumanjanam was performed to the deities.

Later from 1 PM to 4 PM, the Pushpayagam ritual was conducted amidst the Vedic chants and traditional music.

As a mark of atonement for any lapses in rituals during annual Brahmotsavams or daily sevas, this ritual was performed to waive off the sin.

Around 3 tons of 12 varieties of flowers and 6 types of leaves have been uaed. The flowers were donated by devotees from Andhra Pradesh, Tamil Nadu, and Karnataka.

In the evening, the deities were taken in a procession around the four Mada streets.

The temple Dy EO Smt. Shanti, Garden Deputy Director Sri Srinivasulu, AEO Sri Gopinath, temple priests, staff, and a large number of devotees participated.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

క‌న్నుల‌పండుగ‌గా పుష్పయాగం

తిరుపతి, 2025, జూలై 02: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందిఇందులో భాగంగా ఉదయం 9.30 – 11.30 గం. మధ్య శ్రీదేవిభూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్ళుపసుపుచందనంతో అభిషేకం చేశారుఅనంతరం  మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలుమంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.

గత  బ్ర‌హ్మోత్సవాల్లో గానీనిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకులుఅధికారఅనధికారులుభక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందిఇందులో తులసిచామంతిగన్నేరుమొగలిసంపంగిరోజాకలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలుతుల‌సిమ‌రువంద‌మ‌నంబిల్వంప‌న్నీరాకు వంటి 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవిభూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు పుష్పాలను ఆంధ్రప్రదేశ్‌తమిళనాడుకర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారుసాయంత్రం 6 గంటలకు స్వామిఅమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

 కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతిఉద్యానవ‌న‌ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీనివాసులుఏఇవో శ్రీ గోపినాథ్ఆలయ అర్చకులుఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.