KALPAVRIKSHA VAHANA ON FOURTH DAY _ కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
Tirupati, 16 Mar. 21: On the fourth day morning as part of the ongoing annual brahmotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati, Kalpavriksha Vahanam held in Ekantam on Tuesday in view of Covid guidelines.
Sri Kodarama took a celestial ride on this divine tree carrier to fulfil the wishes of His devotees.
Spl. Gr. DyEO Smt Parvati and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
తిరుపతి, 2021 మార్చి 16: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామివారు కటాక్షించారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు.
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీ కోదండరామ స్వామివారు కనువిందు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.