KAPILESWARA – A CYNOSURE ON KALPAVRUKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు
Tirupati, 20 Feb. 20: On the seventh day of ongoing annual Brahmotsavams of Sri Kapileswara temple, Sri Kapileswara Swamy took ride on Kalpavruksha Vahanam – the divine wish fulfilling tree on Thursday morning in Tirupati as a part of the ongoing annual brahmotsavams in this famous Saivaite temple.
Riding with his caravan of devotees, bhajan mandals , kolatas and chakka bhajans, Lord was a cynosure to devotees who bee lined along the streets of temple city to witness the procession.
DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi Raju and others participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 20: శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు కల్పవ క్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు ఆకట్టుకున్నాయి.
అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.