LORD SHINES ON KALPAVRUKSHA VAHANA _ కల్పవృక్ష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారి వైభవం

Tirupati, 29 May 2023: On the fourth day of the ongoing annual brahmotsavam of Sri Govindaraja Swamy temple, Lord along with his consorts blessed devotees by taking a ride on Kalpavruksha vahan amidst his entourage of elephants, kolatas, bhajans etc.

 

Kalpavruksha enhanced the environment giving dividends wished by devotees. Legends speak of it’s origin in sea as a fallout of a battle between devatas and Asuras.

 

Thereafter TTD organized a celestial fete of snapana thirumanjanam and the unjal seva is slated for the evening followed by Sarva bhoopala vahanam at night.

 

TTD is organizing grand Garuda vahana seva on Tuesday, May 30th evening.

 

Tirumala pontiffs kankana bhattar Sri AP Srinivas dikshitulu, dyeo smt shanti, AEO Sri Ravi Kumar, Superintendent Sri Narayana, Temle Inspector Sri Radha Krishna were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారి వైభవం

తిరుపతి, 2023 మే 29: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌ గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్ఠిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్రమథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే స్వామివారు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు.

అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

మే 30న గరుడసేవ :

శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు గరుడసేవ వైభవంగా జరుగనుంది.

వాహనసేవలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏపి శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవి కుమార్, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.