SRINIVASA RIDES ON KALPAVRUKSHA VAHANA _ కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

Tirupati, 23 February 2022: In Sri Rajamannar Alankaram accompanied by His consorts, Sri Kalyana Venkateswara Swamy rode Kalpa Viruksha Vahana and blessed her devotees on Wednesday.

 

On the fourth day of the ongoing annual Brahmotsavams at Sri Srinivasa Mangapuram which was held in Ekantha as per covid guidelines, the processional deity blessed devotees on Kalpavriksha Vahanam.

 

TTD JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Shanti, AEO Sri Gurumoorthy, Superintendent Sri Chengalrayulu, Sri Ramanaiah and temple Archakas Sri Balaji Rangacharyulu were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

తిరుపతి, 2022 ఫిబ్రవరి 23: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత  శ్రీనివాసుడు  శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధ‌రించి కల్పవృక్ష వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవ ఆల‌యంలో  ఏకాంతంగా జరిగింది.

ఐహిక ఫ‌ల ప్రాప్తి :

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలూ శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.

స్నపన తిరుమంజనం :

అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్స‌వ‌ర్ల‌కు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

వాహన సేవలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి,  ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ రమణయ్య, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.