‌SPIRITUAL BOOKS RELEASED _ కల్పవృక్ష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ‌

TIRUMALA, 18 OCTOBER 2023: The publications wing of TTD has released twin religious books in front of Kalpavriksha Vahanam on Wednesday.

The books included Molla Ramayanam(Parimala Vyakhya) by renowned scholar Smt K Malayavasini and another one by Vishnu Puranam in Kannada by Dr CS Urmila.

Both the books were released by TTD Chairman Sri B Karunakara Reddy and TTD EO Sri AV Dharma Reddy. Delhi LAC Chief Smt Prasanthi Reddy and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

కల్పవృక్ష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ‌

తిరుమల, 2023 అక్టోబరు 18: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో రెండు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆవిష్కరించారు.

మొల్ల రామాయణం (పరిమళ వ్యాఖ్యతో) – ఆచార్య కె.మళయవాసిని

రామాయణంలో ధర్మ స్వరూపుడైన శ్రీ రామచంద్రుడు ఈ సమాజంలో ఎలా జీవించాలో తను స్వయంగా ఆచరించి చూపి ఆదర్శ ప్రాయుడైనాడు. వాల్మీకి మహర్షి విరజిత శ్రీమద్రా రామాయణాన్ని భారతీయ భాషల్లో అనేకమంది అనువదించుకున్నారు. తమ తమ ప్రాంతాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ చాలామంది రామ కథను తమ యాస, బాసలలో వ్రాసుకున్నారు.

మొల్ల రామాయణం తెలుగులో విశేష ఆద‌ర‌ణ‌ పొందిన కావ్య‌మని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మొల్ల‌ రామాయణాన్ని ఆచార్య కె.మలయ‌వాసిని పరిమళ వ్యాఖ్యానంతో టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

విష్ణు పురాణం (కన్నడ) – డాక్టర్ సిఎస్.ఊర్మిళ

వేదవ్యాస మహర్షి విరచిత అష్టాదశ పురాణాలలో విష్ణు పురాణం ఒకటి. శ్రీహరి తనకు ప్రధానంగా మూడు గురుతల బాధ్యతలు ఉన్నట్లు గీతలో తెలియజేశాడు. అవి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన ఈ మూడు కార్యక్రమ‌ముల‌కుగాను తానే స్వయంగా ఈ భూమిపై దశావతారాలు ధరించాడు. సృష్టికర్త బ్రహ్మ, స్థితికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు మహేశ్వరుడుని మనకు తెలిసిన విషయమే. విష్ణు పురాణం ఈ త్రిమూర్త్యాత్మక స్వరూపుడు శ్రీహరి అని అతడే సర్వోత్తముడని తెలియజేస్తున్నది. విష్ణు పురాణాన్ని సామాన్య పాటకులకు సైతం అర్థ‌మైయ్యేలా సరళమైన కన్నడ భాషలోనికి అనువదించి టీటీడీ పాఠ‌కుల‌కు అందిస్తున్నది.

ఈ కార్య‌క్ర‌మంలో ఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్ ఇ -2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ విభీష‌ణ శ‌ర్మ‌, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.