కాటేజి డోనర్లకు విజ్ఞప్తి

కాటేజి డోనర్లకు విజ్ఞప్తి

తిరుమల, ఆగష్టు -29,  2009: సెప్టెంబర్‌ 21 నుండి 29 వరకు జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కాటేజిడోనర్లు తాము స్వయంగా ముందస్తు సమాచారంతో తిరుమలకు విచ్చేస్తే, వీరికి డోనార్‌ కాటేజిలను కేటాయిస్తారు. అయితే వీరు సూచించిన వారికి వసతిని కేటాయించరు.

అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ముందుగా తిరుమలలో వసతిని రిజర్వు చేసుకునే విధానాన్ని రద్దు చేయడమైనది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా మనవి చేస్తున్నాము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.