TTD EO PRESENTS SILKS TO KANIPAKAM_ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

Tirupati, 15 September 2024: TTD EO Sri J Syamala Rao on Sunday presented Pattu Vastrams to Sri Kanipaka Varasiddhi Vinayaka temple.
 
In a tradition, TTD has been presenting the silks to this famous temple located in Chittoor district on the occasion of the celestial Kalyanam of the deities at the temple on Sunday evening as a part of Vinayaka Chaviti festivities.
 
Earlier on his arrival, TTD EO was received by the Kanipakam temple EO Sri Guruprasad, AEO Sri Vidyasagar Reddy, archakas and Veda pundits. 
 
After the presentation of silks, TTD EO along with the Tirumala temple DyEO Sri Lokanatham had the darshan of the presiding deity followed by Veda Aseervachanam by the temple priests.
 
Later the Putalappattu Legislator Sri Murali Mohan also felicitated EO on the occasion.
 
Temple DyEO Sri Lokanadham is also present
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

తిరుప‌తి, 2024 సెప్టెంబ‌రు 15: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం టిటిడి తరఫున ఈవో శ్రీ జె. శ్యామల రావు పట్టువస్త్రాలు సమర్పించారు.

కాణిపాకంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం సంద‌ర్భంగా టిటిడి త‌ర‌ఫున‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు ఆల‌య ఈవో శ్రీ గురుప్రసాద్, ఏఈవో శ్రీ విద్యా సాగర్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. ద‌ర్శ‌నానంత‌రం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ ఈ సందర్భంగా టీటీడీ ఈఓ ను కలసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.