KARVETINAGARAM BRAHMOTSAVAMS POSTERS RELEASED _ కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
TIRUPATI, 19 MAY 2022: Karvetinagaram annual Brahmotsavam posters were released by JEO Sri Veerabrahmam in his chamber in TTD Administrative Building in Tirupati on Thursday.
Speaking on the occasion he said the important days includes Dhwajarohanam on May 23, Garuda Seva on May 27, Rathotsavam on May 30 and Chakra Snanam on May 31.
He said on May 26 Kalyanotsavam will be observed for which devotees will be allowed on payment of Rs. 750 per ticket on which two persons are permitted.
DyEO Smt Nagaratna, AEO Sri Durgaraju, Superintendent Sri Ramesh, Temple Inspector Sri Suresh were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
తిరుపతి, 2022 మే 19: కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోగల జెఈవో కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మే 23 నుండి 31వ తేదీ వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. మే 22న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
23-05-2022 ధ్వజారోహణం పెద్దశేష వాహనం
24-05-2022 చిన్నశేష వాహనం హంస వాహనం
25-05-2022 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
26-05-2022 కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
27-05-2022 మోహినీ అవతారం గరుడ వాహనం
28-05-2022 హనుమంత వాహనం గజ వాహనం
29-05-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
30-05-2022 రథోత్సవం అశ్వవాహనం
31-05-2022 చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 26వ తేదీ సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.750/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూన్ 1న మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్వామివారి పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.