KUMARADHARA -PASUPUDHARA THEERTHA MUKKOTI ON MARCH 14 _ కుమారధార తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు
TIRUMALA, 10 MARCH 2025: The Kumaradhara-Pasupudhara Theertha Mukkoti is scheduled to take place in Tirumala on March 14.
The devotees who are aged, physically challenged, obese and suffering from chronic diseases, children below 10 years will not be allowed to trek the Theertham path.
To avoid traffic congestion and for the safety of pilgrims, the APSRTC is arranging buses for the transportation of devotees from the Gogarbham dam to the Papavinasanam Dam.
The devotees will also be allowed to trek the Theertham from 5am till 12noon on March 14.
Srivari Sevaks will render the distribution of Annaprasadam, Buttermilk and water services to the devotees at Papavinasanam Dam from 5am onwards.
Doctors, Paramedical staff, ambulances will also be deployed for the safety of pilgrims.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కుమారధార తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు
• యాత్రికుల కోసం అన్నప్రసాదం, తాగునీటి సౌకర్యాలు
• కుమారధార తీర్థ ముక్కోటికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులు అనుమతించబడరు
తిరుమల, 2025 మార్చి 10: తిరుమలలో మార్చి 14న శుక్రవారం జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు.
అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదు. గోగర్భం నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రయివేటు వాహనాలను అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భక్తులను కోరడమైనది. పాపవినాశనం నుండి కుమారధార తీర్థం వరకు భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
మార్గమధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచుతారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 5 గంటల నుండి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు అన్నదానం చేసేందుకు అనుమతి లేదు. ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నారు.. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్స్‌లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.