KUMARADHARA THEERTHA MUKKOTI ON MARCH 14 _ కుమారధార తీర్థ ముక్కోటిపై అదనపు ఈవో సమీక్ష
TIRUMALA, 27 FEBRUARY 2025: As the Kumaradhara Theertha Mukkoti is scheduled on March 14, the Additional EO Sri Ch Venkaiah Chowdary reviewed on the arrangements to be made for the torrent festival.
The review meeting with the heads of various departments took place at Annamaiah Bhavan in Tirumala on Thursday.
As a part of it the Additional EO reviewed on the security arrangements to be made for the devotees trekking the torrent path in the deep woods in co-ordination with police and forest officials by the TTD security sleuths, Annaprasadam, water distribution arrangements, transportation and many more.
As in the case of previous Theerthotsavams, the devotees who are physically fit alone will be allowed to trek the path and those suffering from chronic heart ailments, obesity, asthama and children below 10 years will not be allowed to trek the path.
All department officials working in Tirumala were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కుమారధార తీర్థ ముక్కోటిపై అదనపు ఈవో సమీక్ష
తిరుమల, 2025 ఫిబ్రవరి 27: మార్చి 14వ తేదిన తిరుమలలో జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి పై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమారధార తీర్థ ముక్కోటికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 14వ తేది ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే భక్తులను కుమారధార తీర్థానికి అనుమతిస్తామన్నారు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతించమని తెలిపారు. పాపవినాశనం నుండి కుమారధార తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
మార్గమధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచాలని, అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్స్‌లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర, ట్రాన్స్ పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.