COMPENSATION TO VICTIMS OF KERALA FAMILY _ కేరళ పాలక్కాడ్ భక్తురాలు వి. నిర్మల కుటుంబానికి రూ.27 లక్షలు పరిహారం చెల్లింపు

Tirumala, 25 January 2025: TTD board members on Saturday handed over Rs 27 lakh compensation to the family of V. Nirmala from Palakkad, Kerala state, who died in the stampede that took place on January 8 during the issue of Sarvadarshanam tokens in Tirupati on the occasion of Vaikuntha Ekadashi. 

The compensation amount includes Rs.25 lakhs, while board member Smt. Vemireddy Prashanthi Reddy gave her own funds of Rs.2 lakhs and paid a total of Rs.27 lakhs. 

TTD board members Sri.  Naresh Kumar, Sri. Ramamurthy, Sri.  Santaram personally visited the victim’s house and handed over the compensation.

 As per the decision of TTD board to give one contract job to one person of the family, the team of board members collected the details of one Kaushiga for the job.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కేరళ పాలక్కాడ్ భక్తురాలు వి. నిర్మల కుటుంబానికి రూ.27 లక్షలు పరిహారం చెల్లింపు

తిరుమల, 2025, జనవరి 25: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీలో జనవరి 8న జరిగిన తోపులాటలో మృతి చెందిన కేరళ రాష్ట్రం పాలక్కాడ్ కు చెందిన వి.నిర్మల కుటుంబానికి రూ.27 లక్షల పరిహారాన్ని టిటిడి బోర్డు సభ్యులు శనివారం అందజేశారు. టిటిడి పాలక మండలి నిర్ణయం మేరకు రూ.25 లక్షలు, టిటిడి బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సొంత నిధులు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.27 లక్షలు అందజేశారు.

మృతురాలు నిర్మల ఏకైక కుమార్తె కౌశిగాకు పరిహారం చెక్ ను టిటిడి బోర్డు సభ్యులు శ్రీ. నరేష్ కుమార్, శ్రీ.రామ్మూర్తి, శ్రీ. శాంతారాం అందజేసి పరామర్శించారు.

టిటిడి పాలక మండలి నిర్ణయం మేరకు బాధితుల కుటుంబంలో ఒకరైన కౌశిగాకు టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వివరాలను బోర్డు సభ్యుల బృందం తీసుకున్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది