SRINIVASA KALYANAM AND VAIBHOTSAVAM PROJECT OFFICES SHIFTS TO KOMALAMMA CHOULTRIES_ కోమలమ్మ సత్రంలోకి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్
Tirupati, 21 June 2023: The office of Srinivasa Kalyanam and Vaibhotsavam Projects of TTD have been relocated from the SVETA building to Komalamma Choultries in Tirupati on Wednesday.
JEO (H&E) Smt Sada Bhargavi inaugurated the new offices after performing special pujas to utsava idols of Sri Venkateswara and His consorts Sridevi and Bhudevi.
Speaking on the occasion the JEO said in order to provide spiritual ambience to the projects the utsava idols were shifted to the Komalamma Choultries spread over 1.5 acres where from they would henceforth be taken to venues of the events held across the country.
Describing the importance of Kolamma Satrams the JEO said the Saree presented to Sri Padmavati Ammavari temple in Tiruchanoor during the annual Brahmotsavam is first offered puja at the Choultries. Henceforth the utsava idols will be offered pujas and Kainkaryams every day, she added.
She said artists of Dasa Sahitya and Annamacharya Projects also regularly render special cultural programs, pravachanams in the corridor of Choultries.
The Special Officer of Dasa Sahitya Project Sri Ananda Thirthacharyulu, VGO Sri Manohar All Projects Program Officer Sri Rajagopal Rao, DPP Secretary Dr Srinivasulu,
SVETA Director Smt Prashanti and others were present.
కోమలమ్మ సత్రంలోకి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్
– శాస్రోక్తంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించిన జేఈఓ శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2023 జూన్ 21: తిరుపతి శ్వేత భవనంలోని టీటీడీ శ్రీనివాస కల్యాణం , వైభోత్సవాల ప్రాజెక్ట్ కార్యాలయాన్ని కోమలమ్మ సత్రం ప్రాంగణంలోకి మార్చారు. బుధవారం జేఈవో శ్రీమతి సదాభార్గవి కోమలమ్మ సత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు శాస్రోక్తంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సూచనల మేరకు 1.5 ఎకరాల విస్తీర్ణంలోని కోమలమ్మ సత్రం లో
ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు శ్రీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ లోని స్వామి అమ్మవార్ల విగ్రహాలను ఇక్కడ ఉంచి నిత్య పూజ, కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నిర్వహించే శ్రీవారి కల్యాణం , వైభోత్సవాలకు ఇక్కడి నుండే ఉత్సవర్లను తీసుకు వెళ్ళనున్నట్లు చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థం రోజున శ్రీవారి ఆలయం నుండి అమ్మవారికి తీసుకువచ్చే సారెను కోమలమ్మ సత్రంలో ఉంచి పూజలు నిర్వహిస్తారన్నారు.
దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్ ల ద్వారా ఈ సత్రంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఈవో వివరించారు. భక్తులు ఈ ప్రాంగణంలో పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.
ఈ పూజా కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థా చార్యులు, విజివో శ్రీ మనోహర్, డిపిపి ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, డిపిపి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసులు, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.