PROCURE VENTILATORS ON FAST TRACK- TTD CHAIRMAN SRI YV SUBBA REDDY _ కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ.సుబ్బారెడ్డి

* Prepare 500 beds in Two days

* Continue Anna Prasadam throughout Lockdown

* TTD chairman inspects Covid hospital

Tirupati, 17 Apr. 20: TTD chairman Sri YV Subba Reddy said that 500 beds with ventilators will be readied at the covid hospital in Sri Padmavati medical college hospital in Tirupati within couple of days.

After his inspection in the hospital on Friday morning the TTD chairman directed the Vice chancellor and Director of SVIMS Dr Vengamma and
also interacted with the District collector Sri Bharat Narayan Gupta
about the Medicare in the hospital.

Later he also interacted with the health workers of the hospital and enquired about supply of PPE kits, masks, sanitizers etc.

COVID HOSPITAL WITH 500 BEDS

Speaking to reporters later the TTD chairman said on the directions of
Chief Minister Sri YS Jaganmohan Reddy, Sri Padmavati medical college
hospital has been designated as Covid hospital with 110 ventilators and
390 beds. The TTD has handed nearly Rs.20 crores to the District Collector to upgrade it into 500 bed hospital with ventilators and all other required
medical equipment.

He said that Anna Prasadam by TTD to shelterless workers who are stranded in Tirupati, poor and beggars will continue through out the Lockdown period. He said as of date nearly 26 lakh food packets have
been distributed among distressed population.

FREE HOME DELIVERY MEDICINE FOR EPILEPSY PATIENTS

The TTD chairman said on the third Sunday of every month the SVIMS
super specialty hospital has been making home delivery of medicines to
250 epilepsy patients of Rayalaseema districts of Nellore and Prakasham. During the lock down period TTD is supplying the medicines through PHCs in their villages.

RMO Dr Koti Reddy, Medical superintendent Dr Ram, Covid Nodal Officer Dr Chandrasekhar, Dr Bhargav, Ramcharan, DD of Public Relations department Sri Venkatram Reddy, SVIMS PRO Rajasekhar participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

వెంటిలేటర్లు వెంటనే తెప్పించండి

* రెండు రోజుల్లో 500 బెడ్లు సిద్ధం కావాలి

* లాక్ డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదం అందిస్తాం

* కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ.సుబ్బారెడ్డి

తిరుపతి, 2020, ఏప్రిల్ 17: కోవిడ్ బాధితుల చికిత్స కోసం కేటాయించిన శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రిలో రెండు రోజుల్లో వెంటిలేటర్లతో సహా మొత్తం 500 బెడ్లు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ.సుబ్బారెడ్డి స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. ఈ విషయం గురించి ఆయన జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్తాతో మాట్లాడారు. గురువారం ఉదయం ఆయన కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించారు. వెంటిలేటర్లు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, సానిటైజర్ల అందుబాటు గురించి అధికారులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం శ్రీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు.

500 బెడ్లతో కోవిడ్ ఆసుపత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు పద్మావతి వైద్యకళాశాల ఆసుపత్రిని కోవిడ్ ఆస్పత్రిగా ఏర్పాటు చేశామన్నారు. ముందుగా అంచనా వేసి ముందుజాగ్రత్త చర్యగా ఇక్కడ 500 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 110 వెంటిలేటర్లు , 390 బెడ్లు ఉంటాయన్నారు. ఇక్కడ వైద్య పరికరాలు, ఇతర కిట్ల కొనుగోలు కోసం టీటీడీ దాదాపు 20 కోట్లు జిల్లా కలెక్టరుకు అందించిందన్నారు.

అన్న ప్రసాదం పంపిణీ కొనసాగిస్తాం

లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదలకు తిరుపతి, పరిసర ప్రాంతాల్లో రోజుకు 1.40 లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా 26 లక్షలకు పైగా ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు ఛైర్మన్ చెప్పారు. లాక్డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదాల పంపిణీ కొనసాగిస్తామని తెలిపారు.

మూర్ఛవ్యాధి వారికి ఇంటికే మందులు

స్విమ్స్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సుమారు 250 మంది మూర్ఛ వ్యాధి రోగులకు ప్రతినెలా మూడో ఆదివారం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. లాక్డౌన్ వల్ల వీరు ఇబ్బంది పడకుండా వారి గ్రామాలకే పీహెచ్ సీల ద్వారా మందులు పంపాలని డైరెక్టర్ వెంగమ్మను ఆదేశించారు.

ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్లు భార్గవ్, రాంచరణ్ , ప్రజాసంబంధాల విభాగం డీడీ వెంకట్రామిరెడ్డి, పీఆర్ఓ రాజశేఖర్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ద్వారా జారీ చేయడమైనది..