PAVITROTSAVAM SRI PRASANNA VENKATESWRA SWAMY TEMPLE IN KOSUVARIPALLI _ కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

Tirupati, September 03, 2025: The sacred Pavitrotsavam commenced at Sri Prasanna Venkateswara Swamy Temple, Kosuvaripalli in Thamballapalle Mandal of Annamaiah District on Wednesday. The day began with Suprabhata Seva, followed by Poornahuti, Punyahavachanam, Kumbha Aradhana, and main Homas at the Yagasala. Later, Snapana Tirumanjanam was performed, while Chatushtana Archana and Poornahuti are scheduled for the evening.

On Thursday, Poornahuti and Pavitra Samarpana will be observed. On Friday, Maha Poornahuti, Pavitra Visarjana, Snapana Tirumanjanam, and Chakrasnanam will be conducted.

TTD officials, temple priests, and a large number of devotees participated in the rituals.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

కోసువారి పల్లి శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

తిరుపతి, 2025 సెప్టెంబర్ 03: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట చేపట్టారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగ‌శాల‌లో పూర్ణాహుతి, పుణ్యాహవచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జ‌రిగాయి. అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం చతుష్టానార్చన, పూర్ణాహుతి జరుగనుంది.

గురువారం పూర్ణాహుతి, పవిత్ర సమర్పణ చేపడతారు.  శుక్రవారం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం చేపడుతారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.