PAVITRA SAMARPANA HELD IN KOSUVARIPALLE _ కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Tirupati, 04 September 2025: As a part of ongoing annual Pavitrotsavams in Sri Prasanna Venkateswara Swamy temple in Kosuvaripalle, Pavitra samarpana was held on Thursday.
In the morning Snapana Tirumanjanam was held to utsava deities. Later Pavitra Malas were offered.
Temple staff were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుపతి,2025సెప్టెంబర్ 04: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగశాలలో పూర్ణాహుతి, పుణ్యాహవచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జరిగాయి. అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం చతుష్టానార్చన, పూర్ణాహుతి జరుగనుంది.
శుక్రవారం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం చేపడుతారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

