SRI PADMAVATI WOMEN’S POLYTECHNIC COLLEGE STUDENT EXCEL IN SPORTS _ క్రీడ‌ల‌లో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థునుల ప్రతిభ

Tirupati, 03 February 2025: The student of Sri Padmavathi Mahila Polytechnic College, Tirupati who participated in the Regional Inter Polytechnic Sports and Games emerged as overall Games Champion.

The student of Sri Padmavathi Mahila Polytechnic College performed exceptionally well in the State Level Inter Polytechnic Sports and Games held at Palamaneru from 15th to 18th December and  28th to 30th January at Visakhapatnam.

In this, Kumari Ramya won the second position in table tennis and was selected for the national level.  

Similarly, she stood as a runner in Khokho,  third in 200 meters running. TTD Education Officer Smt. Vijayalakshmi, College Principal Dr. Asuntha and other staff congratulated Kumari Ramya for her talent in sports. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

క్రీడ‌ల‌లో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థునుల ప్రతిభ

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 03: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థునులు రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో పాల్గొని ఓవరాల్ గేమ్స్ ఛాంపియన్స్‌గా నిలిచారు

పలమనేరులో డిసెంబర్ 15 నుండి 18వ తేదీ వరకు రెండు రోజులపాటు, అదేవిధంగా జనవరి 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజులు పాటు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థునులు విశేష ప్రతిభ కనబరిచారు.

ఇందులో కుమారి రమ్య టేబుల్ టెన్నిస్‌లో ద్వితీయ స్థానంలో విజేతగా నిలిచి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు. అదేవిధంగా ఖోఖోలో ర‌న్న‌ర్‌గా, 200 మీటర్ల ర‌న్నింగ్‌లో మూడవ స్థానంలో నిల్చారు. క్రీడాలలో ప్ర‌తిభ కనబ‌రిచిన కుమారి ర‌మ్య‌ను టీటీడీ విద్యాశాఖ అధికారి శ్రీ‌మ‌తి విజయలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అసుంత, ఇతర సిబ్బంది విద్యార్థునుల‌ను అభినందించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.