కపిలతీర్థంలో కార్తీక సోమవార శివార్చనం
కపిలతీర్థంలో కార్తీక సోమవార శివార్చనం
తిరుపతి, 2020 డిసెంబరు 07: కార్తీక మాస దీక్షల్లో భాగంగా సోమవారం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయ ప్రాంగణంలో కార్తీక సోమవార శివార్చనం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా కేంద్రీయ సంస్కృత వర్సిటీ ఆచార్యులు శ్రీ రాణి సదాశివమూర్తి వ్రతం విశిష్టతను తెలియజేశారు. పవిత్రమైన కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత విశేషమైనదన్నారు. శివుడు, మహేశ్వరుడు, భవుడు, మహాదేవుడు, నీలకంఠుడు, పశుపతి తదితర పేర్లతో పిలవబడుతున్న అంబికా సమేత ఏకాదశ రుద్రాత్మక మహాదేవుని అర్చనం అత్యంత పుణ్యఫలమన్నారు. రుద్రపూజా విధానంలో స్వామి, అమ్మవారిని అర్చించి వారి కృతపకు పాత్రులు కావాలని కోరారు.
ముందుగా పార్వతి పరమేశ్వరుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సంకల్పంతో ఈ పూజను ప్రారంభించి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.