ఖరగ్‌పూర్‌లో శ్రీవారి కల్యాణోత్సవానికి హాజరైన టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

ఖరగ్‌పూర్‌లో శ్రీవారి కల్యాణోత్సవానికి హాజరైన టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

తిరుపతి, 2026 మార్చి 14: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ నగరంలో ఉన్న శ్రీ వైకుంఠ ముఖద్వార శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు హాజరయ్యారు.

ఈ ఆలయంలో మార్చి 7 నుండి 16 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయం నిర్మాణానికి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శ్రీవారి కల్యాణోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.

ముందుగా కోల్‌కతా విమానాశ్రయానికి టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చేరుకోగా, అక్కడి తెలుగు సంఘం ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఆ తరువాత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న చైర్మన్‌కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. కల్యాణోత్సవం అనంతరం టిటిడి చైర్మన్‌ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడింది.