GAJA VAHANAM HELD _ గజవాహనంపై సిరుల తల్లి కటాక్షం

Tirupati, 21 February 2025: The ongoing annual Brahmotsavam at Chennai Sri Padmavati temple witnessed Goddess blessing Her devotees on Gaja Vahanam.

AEO Sri Parthasaradhi and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గజవాహనంపై సిరుల తల్లి కటాక్షం

•⁠ ⁠అమ్మవారి దర్శనంతో పరవశించిన చెన్నై ప్రజలు

చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 21: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు గజవాహనంపై భక్తులను కటాక్షించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవల్లో గజవాహన సేవకు ప్రత్యేకత ఉంది . గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసముద్రంలో ప్రభవించిన సిరులతల్లిని గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది