SRI LAKSHMI NARASIMHASWAMY BLESSES IN LAKSHMI DEVI ALANKARAM ON GAJA VAHANAM _ గజ వాహనంపై లక్ష్మీదేవి అలంకారంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం
Tirupati, 10 March 2025: As part of the annual Brahmotsavam of Tarigonda Sri Lakshmi Narasimha Swamy, on Monday, the utsava deity blessed the devotees as Gaja Lakshmi Devi on the Gaja Vahanam.
According to the Puranas, the darshan of this Vahana seva leads to salvation.
DyEO Smt Varalakshmii, AEO Sri Gopinath, Temple Inspector Sri Krishnamurthy, Temple Priest Sri Krishna Prasad and other officials participated in this program.
KALYANAM ON MARCH 11
As part of Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam, there will be Tiruchi Utsavam at 8 am on Tuesday, Sarvabhupala Vahanam from 4.30 pm to 6 pm, Kalyan utsavam from 8 pm to 10 pm, and Garuda Vahanam from 11 pm to 2 am.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గజ వాహనంపై లక్ష్మీదేవి అలంకారంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం
తిరుపతి, 2025 మార్చి 10: తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు స్వామివారు గజవాహనంపై స్వామివారు శ్రీ గజ లక్ష్మీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.
వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ గోపినాథ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు శ్రీ కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మార్చి 11న స్వామివారి కల్యాణం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8 గంటలకు తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుండి 10 గంటల వరకు కల్యాణోత్సవం, రాత్రి 11 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.