GAJA VAHANA SEVA _ గ‌జ వాహనంపై శ్రీ‌నివాసుడు

TIRUPATI, 03 MARCH 2025: The annual Brahmotsavam in Sri Venkateswara temple at Jubilee Hills witnessed Gaja Vahana seva on monday evening.

AEO Sri Ramesh, temple staff, and devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

గ‌జ వాహనంపై శ్రీ‌నివాసుడు

హైద‌రాబాద్ / తిరుపతి, 2025 మార్చి 03: జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోవారం రాత్రి శ్రీనివాసుడు గ‌జ‌ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.