GAJA VAHANA SEVA _ గజ వాహనంపై శ్రీ కల్యాణ శ్రీనివాసుడు కనువిందు
TIRUPATI, 23 FEBRUARY 2025: The sixth evening at Srinivasa Mangapuram witnessed Sri Kalyana Venkateswara taking a majestic ride atop Gaja Vahanam.
The deity blessed His devotees along four mada streets.
After taking a pride ride on His favourite carrier Garuda on fifth evening, the next evening Sri Kalyana Venkateswara rides on Gaja-the favourite elephant carrier of His consort which symbolizes royalty and riches.
TTD Board member Sri Janga Krishnamurthy, Spl. Gr. DyEO Smt Varalakshmi and other temple staff were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గజ వాహనంపై శ్రీ కల్యాణ శ్రీనివాసుడు కనువిందు
తిరుపతి, 2025 ఫిబ్రవరి 23: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీమన్నారాయణుడు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు.
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
గజ వాహనం – కర్మ విముక్తి
రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.
వాహన సేవలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.