GAJA VAHANAM HELD _ గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి అభయం
TIRUPATI, 15 JUNE 2022: As a part of the ongoing annual Brahmotsavams Gaja Vahana Seva held on the sixth day night at Appalayagunta on Wednesday.
Temple officials, archakas and devotees participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి అభయం
తిరుపతి, 2022 జూన్ 15: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం రాత్రి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గజ వాహనంపై దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవను భక్తులు వీక్షించి స్వామికృపకు పాత్రులయ్యారు.
ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.