GAJA VAHANA SEVA HELD _ గ‌జ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి కనువిందు

TIRUPATI, 24 FEBRUARY 2025: On the sixth evening of the ongoing annual brahmotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati, Sri Somaskanda Murty took out a celestial ride on Gaja vahanam.

On Monday evening, the deity paraded along the temple city streets to bless His devotees on the divine elephant carrier.

DyEO Sri Devendra Babu, AEO Sri Subba Raju and other were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ‌జ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి కనువిందు

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 24: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ సోమస్కంధమూర్తి గజ వాహనంపై అనుగ్రహించారు.

భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

ఆద్యంత రహితుడైన శివదేవుడు, ఐశ్వర్యసూచికమైన గజవాహనాన్ని అధిష్టించినపుడు దర్శనం చేసుకోవడం భ‌క్తుల పుణ్యం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులువి, శేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.