GAJA VAHANA SEVA HELD _ గజ వాహ‌నంపై శ్రీ కల్యాణ వెంకన్న

Tirupati, 25 Feb. 22: As part of the ongoing annual Brahmotsavams Gaja Vahana Seva held in Srinivasa Mangapuram on Friday evening in Ekantam.

Temple DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

గజ వాహ‌నంపై శ్రీ కల్యాణ వెంకన్న

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 25: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్ర‌వారం రాత్రి స్వామివారు గజ వాహనంపై అభయమిచ్చారు.

ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సివస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం – జగత్తునూ, జగన్నాయకుణ్ణీ ఒకచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం. స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగా ఏనుగు స్వామికి వాహనమై, స్వామివారిసేవలో ధన్యం కావడం మహాఫలం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.