NON STOP ANNAPRASADAM SUPPLY ON GARUDA SEVA DAY- CATERING OFFICER SRI SHASTRI _ గరుడసేవ నాడు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు – క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి

Tirumala, 18 October 2023: TTD catering special officer Sri GLN Shasty said that all arrangements have been made for an uninterrupted supply of Anna Prasadam on Garuda Seva day on October 19.

Addressing a media conference at Annamaiah Bhavan on Wednesday he said all preparations are being made for the supply of hot milk to devotees waiting in queues from Wednesday night onwards.

From 5 am on Thursday morning Anna Prasadam supplies will begin at Mada Street galleries with coffee, milk followed by Upm aor Pongal breakfast between 6.30 -10.00 am. From 11am -3 pm TTD is geared to supply bisibelabath made with 14 vegetables besides sweet Pongal. Thereafter Puli hora packets will be distributed till 3.00 pm and Sundal snacks coffee and milk.

He said 15 vehicles, 150 trolleys and an additional 330 men, 830 srivari Sevakulu were being deployed to supply Anna Prasadam in the Mada street galleries.

Similarly, Anna Prasadam will be provided at Matrusri Tarigonda  Vengamamba  Anna Prasadam complex from 7.00 am to1.00 midnight.

Sri Rajendra Kumar Dyeo of Anna Prasadam and other staff were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

గరుడసేవ నాడు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు – క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి

తిరుమల, 2023 అక్టోబ‌రు 18: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 19న గురువారం నాడు జరగనున్న గరుడ సేవకు విశేషంగా విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ శాస్త్రి మాట్లాడుతూ గరుడ సేవ దర్శనం కోసం బుధవారం రాత్రి నుండి గ్యాలరీల్లో భక్తులు వేచి ఉంటారని వీరికి వేడిగా పాలు అందిస్తామని తెలిపారు. గురువారం ఉదయం 5 గంటల నుండి అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఉదయం 5 గంటలకు కాఫీ, పాలు, ఉదయం 6.30 నుండి 10 గంటల వరకు ఉప్మా లేదా పొంగలి, ఉదయం 11 నుంచి 1 గంట వరకు 2.75 లక్షల మందికి మజ్జిగ, మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు 14 రకాల కూరగాయలతో బిసిబేలా బాత్, చక్కెర పొంగలి అందిస్తామన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు పులిహోర ప్యాకెట్లు, సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు సుండలు, పాలు, కాఫీ అందజేస్తామని తెలిపారు. 12 వాహనాలు, 150 ట్రాలీలు, 363 మంది అదనపు సిబ్బంది, 830 మంది శ్రీవారి సేవకులతో గ్యాలరీల్లో భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామన్నారు. అదే విధంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు వెంగమాంబ అన్న ప్రసాదం భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డెప్యూటీ ఈఓ శ్రీ రాజేంద్రకుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.