GARUDA VAHANA SEVA HELD _ గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
TIRUPATI, 15 NOVEMBER 2023: On the sixth day evening Sri Padmavathi Devi took out a celestial majestic ride atop Garuda Vahanam on the pleasant evening of Wednesday as a part of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor.
Wearing the divine Swarna Padalu the divine universal mother paraded along the four mada streets blessing Her devotees.
Both the senior and junior Pontiffs of Tirumala, Chairman Sri Bhumana Karunakara Reddy, board members Sri Subbaraju, Sri Yanadaiah, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy and other officials were present.
గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి, 2023 నవంబర్ 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 7 గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ సుబ్బరాజు, శ్రీ యానాదయ్య , జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, విజివో శ్రీ బాలి రెడ్డి, ఇతర ఆధిరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది