GARUDA SEVA AT JUBILEE HILLS TEMPLE _ గరుడ వాహనంపై శ్రీ వేకటేశ్వరస్వామి కటాక్షం
గరుడ వాహనంపై శ్రీ వేకటేశ్వరస్వామి కటాక్షం
హైదరాబాద్ / తిరుపతి, 2025 మార్చి 02: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్రా ఎల్లా, శ్రీమతి అనుమొలు రంగశ్రీ, ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు..
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది