APPLICATIONS INVITED FOR UNJAL SEVA SINGERS _ గాయకుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 20 October 2023: The Dasa Sahitya Project(DSP) has invited applications from singers to sing  bhakti sangeet during the prestigious Unjal Seva at both Srivari Temple, Tirumala and Sri Govindarajaswami temple, Tirupati 

Interested shall apply online through  http://apps.tirumala.org/dsp/  from October 21 to November 14 and applications through offline or any other way shall not be accepted.

TTD will conduct a selection process from November 24-28 at Mahati Auditorium from morning 9 am to 10pm and the entire process will be recorded by the SVBC to display transparency.

All applicants both male and female are requested to appear for the selection on time and without fail.

TTD also said that no agents of representatives have been appointed by them and cautioned applicants not to trust anyone and feel cheated later.

The DSP Special Officer Sri Ananda Thirthacharyulu has appealed to applicants to log onto the TTD website only for more details.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

గాయకుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి 20 అక్టోబరు 2023: శ్రీవారి సేవలో తరించాలనుకునే గాయకులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది.

దాస సాహిత్య ప్రాజెక్టు తరపున తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో నిర్వహించే ఊంజలసేవలో భక్తి గీతాలు ఆలపించడానికి
ఔత్సాహిక గాయనీ, గాయకులను ఎంపిక చేయనున్నారు.

ఇందుకు గాను టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న గాయనీ, గాయకులు టీటీడీ అధికారిక వెబ్సైట్ htpp://apps.tirumala.org/dsp/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్, లేదా ఇతర మాధ్యమాల ద్వారా పంపే దరఖాస్తులు అంగీకరించబడదు. కళాకారులు అక్టోబర్ 21వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న గాయనీ, గాయకులకు నవంబరు 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 9గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికలో పారదర్శకత పాటించడం కోసం ఎస్వీ బీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తారు. దరఖాస్తు చేసుకున్న గాయనీ గాయకులు వారికి కేటాయించిన సమయానికి హాజరు కావాలని కోరడమైనది. ఈ ప్రక్రియకు సంబంధించి టీటీడీ ఎలాంటి ఏజెంట్లు, ప్రతినిధులను నియమించలేదనీ, మోసగాళ్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించడమైనది. మరిన్ని వివరాలకు టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలని ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఆనంద తీర్థ చార్యులు తెలియజేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చేరి చేయడమైనది