VISAKHA SHARADA PEETHAM PONTIFF LAUDS TTD’s SPIRITUAL DISCOURSES _ గీతా పారాయణంలో పాల్గొన్న శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి

Tirumala, 7 Nov. 20: The Pontiff of Visakha Sharada Peetham, HH Sri Swaroopanandendra Saraswathi Swamy lauded the efforts of TTD for arranging spiritual discourses for the well being of entire humanity when the entire world is combating Corona Virus.

The Seer along with Junior Pontiff Sri Swathmanandendra Swamy participated in Gita Parayanam. In his message he advocated that Bhagavat Gita is a spiritual text not related to just one religion alone. It preaches the essence of life and how to live in a righteous way. He said the Sundarakanda, Gita and Virataparva Parayanams will definitely provide relief to the entire humanity from the clutches of Corona Virus, he asserted. 

TTD Chairman Sri YV Subba Reddy, Additional EO Sri AV Dharma Reddy and others were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గీతా పారాయణంలో పాల్గొన్న శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి 
 
తిరుమల, 2020 నవంబర్  7: విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామివారితో కలిసి టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై శనివారం సాయంత్రం గీతా పారాయ‌ణంలో పాల్గొన్నారు.  
 
అనంతరం శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామివారు అనుగ్రహభాషణం చేస్తూ సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన  శ్రీభగవద్గీత ప్రపంచంలోని  సర్వ మానవాళికి చెందిన అన్ని సమస్యలకు మార్గం చూపిస్తుందన్నారు. శ్రీభగవద్గీతకు సమానమయిన గ్రంధం ఈ లోకంలో   మరొకటి లేదన్నారు. టీటీడీ ప్రతి రోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో సుందరకాండ, విరాటపర్వం, గీతా పారాయణం నిర్వహించడాన్ని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల వలన ప్రపంచం మొత్తం  కరోనా వ్యాధి నుండి విముక్తి కలుగుతుందన్నారు.
 
లోక కల్యాణార్థం సెప్టెంబర్ 10వ తేదీ నుండి ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు టిటిడి తిరుమలలో గీతా పారాయణం నిర్వహిస్తున్న విషయం విదితమే.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.