గుడికో గోమాత పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

గుడికో గోమాత పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి 24 మార్చి 2021: హిందూ ధర్మ ప్రచారంలోభాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ” గుడికో గోమాత ” కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు వెళుతోంది.

ఇందులోభాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని దేవాలయాలకు తగిన వసతి ఉండి గోవును స్వీకరించాలనే ఆసక్తి కలిగిన దేవాలయాలు వినతి పత్రాలు పంపాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్తు బుధవారం ఒక ప్రకటనలో కోరింది.

వినతిపత్రం పంపిన ఆలయానికి గోవును అందిస్తామని తెలిపింది. దరఖాస్తులు ” గుడికో గోమాత” హిందూ ధర్మ ప్రచార పరిషత్తు..తి. తి. దే. శ్వేత భవనం, తిరుపతి చిరునామా కు పంపాలని కోరింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది