గోకులాష్టమి వేడుకలకు ఎస్వీ గోసంరక్షణశాల ముస్తాబు
గోకులాష్టమి వేడుకలకు ఎస్వీ గోసంరక్షణశాల ముస్తాబు
తిరుపతి, 2012 ఆగస్టు 9: ఆగస్టు 10వ తేదీన నిర్వహించనున్న గోకులాష్టమి వేడుకలకు తితిదే శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన తి.తి.దే హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.