SPECIAL PUJAS AT GOGARBHAM DAM _ గోగర్భం డ్యామ్ వద్ద ప్రత్యేక పూజలు
Tirumala, 05 December 2024: As The rains in Tirumala for the past few days are filling up the reservoirs TTD conducted special pujas at Gogarbham Dam on Thursday as water reserves reached full capacity.
TTD Chairman Sri BR Naidu and Additional EO Sri. Ch. Venkaiah Chowdary participated in this program and performed pujas and offered Jala Hararti.
On this occasion, the Additional EO said that the Gogarbham, Akashaganga and Papavinasanam dams in Tirumala are completely full due to the recent abundant rainfall. He said that if it rains again, the Kumaradhara and Pasupudhara dams will also be filled. At present, around 50 lakh gallons of water are being consumed in Tirumala every day.
He informed that the current water reserves are sufficient for 300 days of drinking water needs.
TTD board members Sri. Santaram, Deputy EO Sri.Lokanatham, Water Works EE Sri. Sudhakar, VGO Sri. Surendra and other officials participated in this program.
The water level details of the reservoirs as of 4 pm on Thursday are as follows.
1) Papavinasanam Dam :- 697.05 m.
FRL:- 697.14 m.
Storage Capacity:- 5240.00 Lakh Gallons.
Current storage:- 5208.00 lakh gallons.
2) Gogarbham Dam :- 2894.00 feet
FRL :- 2894.00 Ft
Storage Capacity:- 2833.00 Lakh Gallons.
Current storage:- 2833.00 lakh gallons.
3) Akashaganga Dam :- 865.00 m
FRL:- 865.00 m.
Storage Capacity:- 685.00 lakh gallons.
Current storage:- 685.00 lakh gallons.
4) Kumaradhara Dam:- 896.50 m.
FRL:- 898.24m.
Storage Capacity:- 4258.98 Lakh Gallons.
Current storage:- 3724.43 lakh gallons.
5) Pasupudhara Dam :- 896.50 m.
FRL :- 898.24m.
Storage Capacity:- 1287.51 Lakh Gallons.
Current storage:- 966.31 lakh gallons.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గోగర్భం డ్యామ్ వద్ద ప్రత్యేక పూజలు
తిరుమల, 2024 డిసెంబరు 05: గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకోవడంతో గోగర్భం డ్యామ్ వద్ద గురువారం టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొని పూజలు నిర్వహించి జల హారతి సమర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవడంతో తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం డ్యామ్ లు పూర్తిగా నిండాయని తెలిపారు. మరోసారి వర్షం పడితే కుమారధార, పసుపుధార డ్యామ్ లు కూడా నిండిపోతాయని చెప్పారు. ప్రస్తుతం తిరుమలలో రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగమవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత నీటి నిల్వలు 300 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారామ్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వాటర్ వర్క్స్ ఈఈ శ్రీ సుధాకర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గురువారం సాయంత్ర 4 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
1) పాపవినాశనం డ్యామ్ :- 697.05 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామర్థ్యం :- 5240.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 5208.00 లక్షల గ్యాలన్లు.
2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం :- 2833.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 2833.00 లక్షల గ్యాలన్లు.
3) ఆకాశగంగ డ్యామ్ :- 865.00 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామర్థ్యం :- 685.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 685.00 లక్షల గ్యాలన్లు.
4) కుమారధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 4258.98 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 3724.43 లక్షల గ్యాలన్లు.
5) పసుపుధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 1287.51 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 966.31 లక్షల గ్యాలన్లు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.