EVERY INDIAN SHOULD PROMOTE GO SAMRAKSHANA- TTD CHAIRMAN _ గోసంరక్షణ బాధ్యత భారతీయులందరిపైనా ఉంది-  టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

* 49 CRORE GRANT FROM CENTRE FOR BOOSTING SAHIWAL BREED

  • GOKULASHTAMI FESTIVITIES AT SV GOSHALA AND ALIPERI GO MANDIRAM

Tirupati, 07 September 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy advocated on Thursday that it is duty of every Citizen of India to protect Gomata as the sacred cow is a mother to all Hindus.

As part of Gokulashtami celebrations, the TTD Chairman participated in Gopuja Mahotsavam at SV Gosamrakshanasala and also observed special Abisekam of Sri Venugopala Swami at Sapta  Pradakshina Mandiram at Alipiri.

Speaking on the occasion the TTD Chairman said the Union Government has recognised the TTDs Sahiwal cows breeding program and granted ₹40 crores for the project.

He said Gopuja at SV Goshala was an annual feature and over years TTD has taken up several Gosamrakshana projects and also donated Cows to farmers to highlight the importance of the bovines.

During his earlier stint as TTD Chairman, an international seminar was conducted titled Vande Gomataram in which a few Nobel laureates also participated and deliberated on the uses of cows to society. TTD will soon promote such conferences.

Earlier the TTD Chairman was received by artists with a colourful display of bhajans, kolatams etc. He fed sugar cane and fruits to elephants ahead of Darshan of Sri Venugopal Swami. Thereafter he he offered puja to a pair of cow and calf and also fed fodder.

He also participated in the Sri Venkateswara Divya Maha Mantra Yajna Purnahuti program and submitted books of Sri Venkateswara Maha Mantra Likhita Japam at a stupa.

SV Gosamrakshana committee members Sri Ramsunil Reddy, CVSO Sri Narasimha Kishore, Goshala Director Dr Harnath Reddy and Dyeo Smt Shanti were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గోసంరక్షణ బాధ్యత భారతీయులందరిపైనా ఉంది

– సాహివాల్ గోసంతతి అభివృద్ధి కోసం కేంద్రం రూ.40 కోట్ల గ్రాంట్

–  టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

–  ఎస్వీ గో సంరక్షణశాల, సప్త గోప్రదక్షిణ మందిరంలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 07, సెప్టెంబరు 2023: గోవు హిందువులకు తల్లి లాంటిదని, భగవంతునితో సమానంగా పూజలు చేస్తారని, అలాంటి గోవును సంరక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. గోకులాష్టమి సందర్భంగా గురువారం టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి-గోపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా, అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి విశేషంగా అభిషేకం చేశారు.

గోశాలలో జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గోశాలలో సాహివాల్ గోసంతతి అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను గుర్తించి రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.40 కోట్ల గ్రాంట్ అందించిందని వెల్లడించారు. టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర గోశాలలో గోకులాష్టమి సందర్భంగా గోపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. టీటీడీ కొన్ని సంవత్సరాలుగా గోసంరక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని చెప్పారు. గోమాత విశిష్టతను తెలిపేలా అవసరమైన రైతులకు గోవులను దానంగా ఇస్తున్నట్టు చెప్పారు. పూర్వపు రోజుల్లో ప్రతి రైతు ఇంట్లో గోవులు ఉండేవని, గతంలో ఒట్టిపోయిన గోవులను రైతులు గోశాలకు ఇస్తే, వాటిని సంరక్షించేవారని వివరించారు. గతంలో తాను ఛైర్మన్ గా ఉన్నప్పుడు వందే గోమాతరం పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించామని, ఇద్దరు నోబెల్ గ్రహీతలు కూడా ఇందులో పాల్గొని గో ఉత్పత్తులు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయంపై చర్చించారని చెప్పారు. ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహిస్తామన్నారు.

ముందుగా టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డికి కళాకారులు కోలాటాలు, పిల్లనగ్రోవులు, భజన బృందాలతో ఘనంగా స్వాగతం పలికారు. గజరాజులకు చెరకు, పండ్లు అందించిన అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారిని ఛైర్మన్ దర్శించుకున్నారు. అక్కడినుంచి గో మందిరానికి చేరుకుని, గోవు, దూడకు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించి పూల దండలు వేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. దాణా, మేత తినిపించి పాలు సేకరించారు.

అనంతరం గోసంరక్షణశాలలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర దివ్య మహా మంత్ర యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో ఛైర్మన్ పాల్గొన్నారు. తరువాత శ్రీ వేంకటేశ్వరదివ్య మహామంత్ర లిఖిత జపం పుస్తకాలను స్థూపంలో సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ గో సంరక్షణ కమిటీ సభ్యులు శ్రీ రామ్ సునీల్ రెడ్డి, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.