PLEDGE TO PROTECT DESI COWS- TTD CHAIRMAN _ గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

Vijayawada, 7 December 2020: Giving a clarion call that everyone should pledge to protect Gow Mata, the TTD Chairman Sri YV Subba Reddy on Monday appealed for the donation of Desi breeds of cows to TTD.

The TTD Trust Board Chief launched the Gudiko-Gomata programme sponsored by the HDPP and SV Go-Samrakshanashala at Sri Kanaka Durga temple in Vijayawada along with AP Endowments Minister Sri V Srinivas on Monday.

A pair of cow and calf were handed over to the temple authorities amidst chanting of Veda mantras and Mangala Vaidyams.

Speaking on the occasion the TTD Chairman said the cow occupied the place of mother and hence hailed as Gomata in Hindu Sanatana Dharma. The Puranic legends say that worship of Cow beget fruits of worship of all Gods. He appealed that everyone should swear to protect the cows in the country. 

He said the Go Samrakshana programme has been launched by TTD board under the instructions of Honourable Chief Minister of AP Sri YS Jaganmohan Reddy. A detailed action plan is being prepared for implementing the program in Telangana Karnataka, Andhra Pradesh and Tamilnadu, he added.

The AP Endowment Minister Sri Velampalli Srinivas lauded the unique Program of TTD as a trendsetter and that it should be supported by all.

Local MLAs Sri Malladi Vishnu, Sri Jogi Ramesh, Sri K Parthasarathy, TTD JEO Sri P Basant Kumar, HDPP secretary Acharya Rajagopalan, Sri Kanaka Durga temple trust board president Sri Somi Naidu, EO Sri Suresh Babu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
 
–  టీటీడీ కి దేశవాళీ గోవులను దానం చేయండి
 
–  గుడికో గోమాత ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
      
తిరుపతి 7 డిసెంబరు 2020: గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు.  హిందూ ధర్మ రక్షణ కోసం  టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమానికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని కోరారు.
        
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణ శాల నేతృత్వంలో అమలు చేయనున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని సోమవారం విజయవాడ కనక దుర్గ ఆలయంలో మంత్రి వెలం పల్లి శ్రీనివాస్ తో కలసి ఆయన ప్రారంభించారు. వేద పండితుల మంత్రో చ్చారణల నడుమ దుర్గ గుడికి గోవు, దూడను అందించారు.
         
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ , హిందూ ధర్మం లో గోమాతకు తల్లి స్థానం ఇచ్చారునీ అందుకే గోవును గోమాత అంటామన్నారు.
  
గోవును పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నారు.
 గో సంరక్షణ కూడా హిందూ ధర్మ పరిరక్షలో ఒక భాగమే నని చైర్మన్ చెప్పారు.                                   
     
ముఖ్యమంత్రి శ్రీ  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆమోదంతో గోసంరక్షణ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు.  ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క , తమిళనాడు రాష్ట్రాల్లోని  దేవాల‌యాల్లో  గుడికో  గోమాత  కార్య‌క్ర‌మాన్ని  ప్రారంభించడానికి ప్రణాళికలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు.                            
    
హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లుచేయ‌నున్నామన్నారు.
 
ఈ కార్యక్రమం అమలు కోసం  ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ద్వారా దేశ‌వాళీ ఆవుల దానాన్ని స్వీక‌రించాల‌ని టీటీడీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
 
 మ‌ఠాలు, పీఠాలు, వంశ‌పారంప‌ర్య ప‌ర్య‌వేక్ష‌ణ ఆల‌యాలు, దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాలు, వేద పాఠ‌శాలల‌కు ఈ కార్య‌క్ర‌మం ద్వారా టీటీడీ గోవుతో పాటు దూడను అంద‌జేస్తుందన్నారు.
 
 గోదానం పొందిన ఆల‌యాలు, పీఠాలు, వేద‌పాఠ‌శాల‌లు గోవుల సంర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 
 
టిటిడి ద్వారా దానం పొందిన గోవుల వ‌ద్ద గుడికో గోమాత – టిటిడి అనే బోర్డు త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేయాలని వివరించారు. ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ముంద‌స్తు అనుమ‌తితోనే భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మానికి గోవుల‌ను దానం చేయాల్సి ఉంటుందని శ్రీ వైవి చెప్పారు.                                            
 
రాష్ట్ర దేవ దాయ శాఖ మంత్రి శ్రీ వేలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గోసంరక్షణ కోసం టీటీడీ చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలన్నారు.          
 
శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు, శ్రీ జోగి రమేష్,  శ్రీ కొలుసు పార్థ సారథి, టీటీడీ జెఈఓ శ్రీ బసంత్ కుమార్, ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, దుర్గ గుడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ సోమి నాయుడు, ఈఓ శ్రీ  సురేష్ బాబు  పాల్గొన్నారు.                                        
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది