BHUMI PUJA IN MUMBAI ON JUNE 7 _ గౌతమ్ సింఘానియాకు శ్రీవారి ఆలయ భూమి పూజకు ఆహ్వానం
TIRUMALA, 30 MAY 2023: TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri AV Dharma Reddy invited donor Sri Gautham Singhania for Bhumi Puja of Srivari temple on June 7 in Mumbai on Tuesday.
They have also invited the Deputy CM of Maharastra Sri Devendra Fadnavis for the temple event.
On Monday evening both the TTD bigwigs have invited the CM of Maharastra Sri Eknath Shinde for the Bhumi Puja and offered Theertha Prasadams.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
గౌతమ్ సింఘానియాకు శ్రీవారి ఆలయ భూమి పూజకు ఆహ్వానం
తిరుమల 30 మే 2023: ముంబై లో జూన్ 7 వ తేదీ జరిగే శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన దాత శ్రీ గౌతమ్ సింఘానియాకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మంగళవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ముంబైలో వారు సింఘానియాను కలసి శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అలాగే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా కలసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఇదిలా ఉండగా సోమవారం రాత్రి చైర్మన్, ఈవో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండేని కలసి ఆహ్వాన పత్రిక అందజేసిన విషయం తెలిసిందే.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది