గజ వాహనంపై శ్రీ కోదండ రాముడు
గజ వాహనంపై శ్రీ కోదండ రాముడు
తిరుపతి, 2021 మార్చి 18: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం రాత్రి స్వామివారు గజ వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు
హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. గజరాజు రాజసానికి ప్రతీక . రణరంగంలో కానీ, రాజధర్భాలలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీమతి పార్వతి, శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.