KAPILESWARA RIDES GAJA VAHANA _ గజ వాహనంపై శ్రీ కపిలేశ్వరుడు
Tirupati, 9 Mar. 21: On the Sixth day of the ongoing annual Brahmotsavams at Sri Kapileswara Swamy temple in Tirupati, Sri Kapileswara Swamy took a celestial ride on Gaja vahana held in Ekantam due to Covid guidelines.
DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Archakas and officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గజ వాహనంపై శ్రీ కపిలేశ్వరుడు
తిరుపతి, 2021 మార్చి 09: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఆద్యంతరహితుడైన శివదేవుడు, ఐశ్వర్యసూచికమైన గజవాహనాన్ని అధిష్టించడం భక్తుల కోటిజన్మల తపఃఫలం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.