ఘనంగా అన్నమయ్య తిరునక్షత్రం ఉత్సవం

ఘనంగా అన్నమయ్య తిరునక్షత్రం ఉత్సవం

తిరుపతి, జూన్‌ 21, 2013: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు జన్మించిన రోజును పురస్కరించుకుని తితిదే శుక్రవారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరునక్షత్రం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఉదయం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ వేంకటేశ్వర్లు భాగవతార్‌ హరికథా పారాయణం చేశారు. రాత్రి 7.00 గంటలకు తరిగొండ వెంగమాండ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.జి.కృష్ణమూర్తి ”తాళ్లపాక కవుల మేలుకొలుపు సంకీర్తనలు” అనే అంశంపై ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్‌చార్జి సంచాలకులు శ్రీ మునిరత్నంరెడ్డి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.